తాజాగా ప్రభాస్ కల్కి 2898 AD అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే… ఈ సినిమాతో నాగ్ అశ్విని కి కూడా మంచి గుర్తింపు లభించింది … అయితే ఇదిలా ఉంటె ఎప్పుడు రియాక్ట్ అవ్వని ప్రభాస్ కల్కి విజయంపై భవ్యోద్వేగా పోస్ట్ చేసారు …
ఇంత పెద్ద విజయం అందించిన తన అభిమానులకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అలానే ఇలాంటి గొప్ప సినిమాలో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను … అలాగే గొప్ప నటులతో యాక్ట్ చేసే అవకాశం రావడం అదృష్ణమంటూ చెప్పుకొచ్చారు.
ఈ మూవీ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా … అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. అదరగొట్టారు .. కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించగా … రాజేంద్ర ప్రసాద్ , శోభన , మృణాల్ ఠాకూర్ , విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.దిశా పటాని ఈ మూవీ లో హీరోయిన్ గా నటించగా … రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ , అనుదీప్ కే వి ఈ సినిమాలో చిన్న చిన్న క్యామియో పాత్రలలో కనిపించారు. వాళ్ళందరి వల్లే కల్కి కి ఇంత హైప్ వచ్చిందని టాలీవుడ్ లో టాక్ కూడా నడిచింది … సో మొత్తానికి నాగ్ అశ్వని కాతాలో మంచి సినిమానే పడింది..
ఇకపోతే ఈ సినిమా నిన్నటితో ప్రపంచ వ్యాప్తంగా 18 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. 18 వ రోజు ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో బాహుబలి 2 సినిమా 2.60 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో ఉండగా … బాహుబలి మొదటి భాగం 1.45 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో ఉంది. ఇకపోతే తాజాగా ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి సినిమా విడుదల అయిన 18 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.84 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఇలా ప్రభాస్ తాను హీరోగా రూపొందిన సినిమాల రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డును సృష్టించాడు.