తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ వేగంగా సాగుతోంది. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేకు గాలం వేసే పనిలో పడ్డారు .. చూడాలి రేవంత్ రెడ్డి అనుకున్నది చేసి కారు ను ఖాళీ చేస్తారేమో .. ప్రస్తుతం సగానికి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు .. మిగిలినవారు కూడా
రెడీ గా ఉన్నారని టాక్ … కొందరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ తో కి టచ్ లోకి వెళ్లారు .. సో ఇప్పటికే 9 ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్… ఇప్పుడు మరికొందరితో టచ్ లోకి వెళ్లింది. మండలిలో బీఆర్ఎస్ పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తుండటంతో… జిల్లాల వారీగా ఆపరేషన్ స్టార్ట్ చేసింది..
ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన చల్లా వెంకట్రామిరెడ్డితో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ పెద్దలు.. ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ జిల్లాల్లో బీఆర్ఎస్ కు ఆరుగురు ఎమ్మెల్సీలు ఉండగా, ఇప్పటికే ఒకరు కాంగ్రెస్‌లో చేరారు. మిగిలిన ఐదుగురిలో ముగ్గురితో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతుండగా… ఇందులో ఇద్దరు హస్తం పార్టీ గూటికి చేరేందుకు దాదాపు సిద్ధమైపోయినట్లు సమాచారం.ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ కు గట్టిపట్టున్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎమ్మెల్సీ పదవుల్లో అగ్రతాంబూలమే దక్కింది. రాష్ట్రంలో మిగిలిన ఏ జిల్లా వారికి ఇవ్వనన్ని ఎమ్మెల్సీ పదవులను వరంగల్ కు గులాబీ బాస్ కేసీఆర్కట్టబెట్టారు. తనకు అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, సత్యవతి రాథోడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బీఆర్ఎస్ సీనియర్ నేత తక్కపల్లి రవీందర్రావు, కేటీఆర్ స్నేహితుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డితోపాటు మండలి ఉపాధ్యక్షుడు బండ ప్రకాశ్‌కు ఈ జిల్లా నుంచి అవకాశం ఇచ్చారు. వీరిలో బస్వరాజు సారయ్య రాత్రికి రాత్రే కాంగ్రెస్ కండువా కప్పేసుకోగా, మిగిలిన ఐదుగురిలో ముగ్గురితో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతోందని సమాచారం.
ఇదిలా ఉంటె ..
ప్రస్తుతం ముగ్గురితో టచ్ లోకి వెళ్లిన కాంగ్రెస్… ప్రధానంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్‌కు వీరవిధేయురాలిగా గుర్తింపు పొందిన సత్యవతి రాథోడ్ గతంలో టీడీపీలో పని చేయడంతో.. ఆమెను కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. సత్యవతి రాథోడ్ గాడ్ ఫాదర్ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరడంతో ఆమె కూడా కాంగ్రెస్ గూటికి చేరిపోతారనే టాక్ వినిపిస్తోంది. ఆమె పదవీకాలం కూడా త్వరలో ముగుస్తున్నందున కాంగ్రెస్ లో చేరితో మరో అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితోనూ సత్యవతి రాథోడ్ కు మంచి సంబంధాలే ఉండటంతో ఆమె చేరిక దాదాపు ఖాయమని తెలుస్తోంది.
.
కారు ఇంక సెడ్కే .. కేసీఆర్ కి ఉమ్మడి వరంగల్ లో షాక్ ..!
0Keep Reading
Add A Comment
Follow Us For More Updates
Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.
© 2024 GoldAndhra | All Rights Reserved