ఏపీ లో రాజకీయాలు భగ్గుమంటున్నాయి … ఏపీ రివేంజ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. చేతిలో అధికారం ఉందికదా అని రెచ్చిపోయి అక్రమాలకు పాల్పడ్డ నేతలకు కూటమి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది.. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన దారుణాలు… దందాలు అన్ని ప్రజలు గమనించే ఓడించారు ..మాట తప్పను. మడమ తిప్పను. చెప్పాడంటే, చేస్తాడంతే. ఈ రైమింగ్ డైలాగులు వినడానికి బాగున్నాయి కదా. ఇవి చెప్పుకునే జగన్ 5 ఏళ్ళు కాలం గడిపేసారు .. 2019 ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతానికి పైగా పూర్తిచేశానని జగన్ చెప్పడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. సీపీఎస్ రద్దు, పోలవరం, మద్య నిషేధం, ప్రత్యేకహోదా సాధన, మెగా డీఎస్సీతో సహా వైఎస్ ప్రారంభించిన జలయజ్ఞం పూర్తి ఇలా చెప్పుకుంటూ పోతే పూర్తికానివి ఎన్నో ఉన్నాయి. అయినా 99 శాతానికి పైగా హామీలు అమలు చేశానని ఎంత పచ్చిగా అవాస్తవాలు వల్లెవేశారో. జగన్ మాటలు వింటుంటే సిగ్గుగా ఉంది .. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి .. 5 ఏళ్ళు ఫథకాల పేరుతో ప్రజల్ని మోసం చేసారు … పోలవరం , మద్యపానం మీద ద్రుష్టి పెట్టకుండా కాలం గడిపారు … అలాగే వైసీపీ మినిస్టర్ కూడా సందు దొరికితే జగన్ భజన చేశారు కానీ ఒక్కటి కూడా అభివృద్ధి జరగలేదు …
ఇదిలాఉంటే అయితే వాటింటిపై ఓ వైపు చంద్రబాబు మరో వైపు ప్రజలు దండెత్తుతుండడంతో.. వైసీపీ నేతలకు ఊపిరి ఆడడం లేదు. . మరోవైపు పవన్ కళ్యాణ్ అభివృద్ధి దిశగా పాటు పడుతున్నారు … అలాగే సీఎం చంద్రబాబు పోలవరం … రాజధానుల పై కసరత్తులు స్టార్ట్ చేసారు … అలాగే మహిళలకు ఫ్రీ బస్సు … ప్రతి ఇంట్లో ఆడపిల్లకు 1500 రూపాయలు కూడా అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నారు ..
ముఖ్యంగా సీఎం బాబు ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సామాజిక పెన్షన్ల పంపిణీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో వాలంటీర్ల సాయంతో వైసీపీ సర్కార్ అందించిన పెన్షన్ల స్ధానంలో కూటమి సర్కార్ సచివాలయ సిబ్బందితో వీటిని అందజేస్తోంది. .. ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్లను ఈ మేరకు కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు గత నెలలో దగ్గరుండి పంపిణీ చేయించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇకపై ప్రతీ నెలా ఒకటో తేదీన జరిగే పెన్షన్ల పంపిణీలో తమ పార్టీ టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర స్ధానిక నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు… అంతే కాదు ఈ కార్యక్రమంలో పాల్గొనే విషయంలో ఎలాంటి సాకులు చెప్పొద్దని తేల్చిచెప్పేసారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు… ఇదంత చుస్తే చంద్రబాబు ఈసారి గట్టిగానే ప్లాన్ చేసారని తెలుస్తుంది .. ఇదే జరిగితే ప్రజలు చంద్రబాబు ను నమ్మితే … వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ఓటమి ఖాయమని నేతలు భావిస్తున్నారు …