డొక్కా సీతమ్మ నేటి తరానికి పెద్దగా పరిచయం లేక పోవచ్చు ..కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక మధ్యాహ్న భోజన పధకానికి ఆమె పేరు పెట్టడంతో .. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పేరు వార్తల్లో నిలిచింది .. భోజన పధకానికి ఆమె పేరు పెట్టడం వెనుక బలమైన కారణం ఉంది .. అదేంటి అంటి డొక్కా సీతమ్మ అంటే అన్నం పెట్టె అమ్మ . అమ్మ ఆకలి అంటే చాలు ఆ హృదయం చలించి పోతుంది ..ఈ సమయంలో అయినా సరే ఆకలి అని ఎవరు వచ్చిన ప్రేమగా వండి వడ్డించి పెడుతుంది .. డొక్కా సీతమ్మ తూర్పు గోదావరి జిల్లాలోని మండపేటలో 1841లో జన్మించారు. ఈమె తండ్రి భవానీశంకరం, తల్లి నరసమ్మ గార్లు. సీతమ్మ గారి తండ్రి గ్రామస్తులు ‘బువ్వన్న’ గారనే పేరుతో పిలుస్తుండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ ‘బువ్వపెట్టటమే.. అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ గారు సైతం .. అన్నార్తుల ఆకలిని తీర్చిడమే పరమావధిగా బతికారు సీతమ్మ బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ మరణిస్తే, ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ గారి మీద పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించారు. ఆ తర్వాత లంకగన్నవరం గ్రామానికి చెందిన డొక్కాజోగన్న ని వివాహమాడింది .. . ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు.. సీతమ్మ అత్తవారింట్లో అడుగు పెట్టినా .. . ఆమెలో సహజంగా ఉన్న దాతృత్వం ఏ మాత్రం తగ్గలేదు . జోగన్న, సీతమ్మ గార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుపక్కల గ్రామాల వారందరూ గొప్పగా చెప్పుకునే వారు. ఆప్యాయతా, ఆదరణలకు నిలయంగా వారి ఇంటిని గురించి చెప్పుకునేవారు. ఏ వేళ అతిధులు వచ్చినా .. వారికి అన్నపానాదులు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదాలు చెయ్యటం ఒక పవిత్రకార్యంగా ఆ దంపతులు స్వీకరించారు.
ఆవిడ గురించి ఆ ప్రాంతంలో తెలియని వారు లేరు .. ఆమె గొప్ప మాతృగణాని వివరించే ఘటనలెన్నో ఉన్నాయి .. ఆవిడ తన జీవితంలో ఒకేఒక్కసారి అంతర్వేది లక్ష్మి నరసింహ స్వామి దర్శనానికని బయలుదేరగా … గోదావరి వంతెన వద్ద పల్లకి మోసే బోయీలు అలసిపోయి కూర్చున్నారు. అటుగా వెళుతున్న ఒక బృందంలో పిల్లలు ఆకలి అని ఏడుస్తుంటే, పెద్దవాళ్ళు ఒక్క అరగంట లో గన్నవరం వెళ్లీపోతాం… అక్కడ సీతమ్మ మనకు అన్నం పెడతారుఅని మాట్లాడుకోవటం ఆమె విన్నారు వెంటనే ఆవిడ అంతర్వేది వెళ్ళటం మానేసి వీళ్ళకి అన్నం పెట్టాలి అని వెనుకకు వెళ్ళిపోయారు. అంతటి నిరంతర దాత ఆవిడ. అ కాలంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో.. అపర అన్నపూర్ణ’ గా సీతమ్మ పేరుపొందారు. చివరకి అందరికీ పెట్టి పెట్టి, ఆ దంపతులకి తినటానికి ఏమీ లేకుండా పోయింది. ఒకానొకప్పుడు ఆవిడ భర్త .. ఎందుకు ఇంకా ఈ అన్నదానం.. మనకి కూడా తినటానికి ఏమీ లేదు. వచ్చి ఎవరైనా తలుపుకొడితే సిగ్గేస్తోంది.. పెట్టడమా మానవు..ఇంత అన్నం పప్పైనా పెడతావు…”అన్నారు. దానికి ఆవిడ ..నేను నిస్వార్థముగా పెట్టేటప్పుడు, వచ్చిన వారు తింటున్నప్పుడూ వచ్చినదీ, తింటున్నదీ శ్రీ మహా విష్ణువని నమ్మి పెట్టాను.
ఎవరిని నమ్మి నేను పెట్టానో వాడు పెట్టే చేతిని ఎందుకు నరికేస్తాడు..మనకీ వాడే పెడతాడు అని చెప్పింది. తరువాత ఒక రోజు సాయంకాలం ఇన్నాళ్ళ నుంచీ దున్నుతున్న అదే పొలానికి వెళ్లి సీతమ్మ భర్త గునంతో తవ్వుతున్నారు. గునపానికి ఏదో తగిలింది . ఆయన మట్టి తీసి చూస్తే ఒక బిందె కనపడింది. బిందె మూత తీస్తే, దాని నిండా బంగారు నాణాలే. ఆ బంగారు కాసుల రాశులతో మళ్లీ రొజూ కొన్ని వందల మందికి అన్నదానం చేసారు. బ్రిటిష్ చక్రవర్తి తూర్పు గోదావరి జిల్లా కలక్టరుకి డొక్కా సీతమ్మ ఫోటో తీసి పంపించమని ఉత్తరం వ్రాసాడు. ఎందుకు అంటే .. నాకు పట్టాభిషేకం జరిగే సమయంలో ఆవిడకు నమస్కారం పెట్టాలి. కానీ ఆవిడ సముద్రం దాటి రారు కాబట్టి.. ఆ సమయములో ఒక సోఫా వేసి, ఆవిడ ఫోటో అందులో పెట్టి, ఆవిడకు నమస్కారం పెట్టి అప్పుడు పట్టాభిషేకం చేసుకుంటా అని వ్రాసాడు. తూర్పు గోదావరి జిల్లా కలక్టరు ఫోటోగ్రాఫర్ ని తీసుకుని ఆవిడ దగ్గరకు వెళ్తే, నేను ఈ సన్మానాల కోసం, ఫోటోల కోసం, నమస్కారాల కోసం అన్నదానం చెయ్యలేదు. విష్ణు మూర్తికి అన్నం పెడుతున్నాని పెట్టాను. దీనికి ఫోటోలు పట్టభిషేకాలు ఎందుకు, వద్దు అన్నారు. “అమ్మ ఇది బ్రిటిష్ ప్రభువుల ఉత్తరం. మీరు తీయించుకోకపోతే నా ఉద్యోగం తీసేస్తారు అని ఆ కలెక్టరు చెబితే, “నీ ఉద్యోగం పోతుంది అంటే, తీయించుకుంటా, నువ్వు అన్నం తినాలి అని తీయించుకున్నారు బ్రిటిష్ చక్రవర్తి నిజంగానే ఒక సోఫాలో ఆవిడ ఫోటో పెట్టి, నమస్కరించి, పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆవిడకి పంపించిన పత్రం కూడా ఇప్పటికీ ఉంది. అన్నదానాన్ని మించిన దానంలేదని చెప్పటమే కాకుండా నఅన్నార్తులందరికీ మాతృప్రేమను పంచి జీవితాన్ని చరితార్ధం చేసుకున్న ‘అపర అన్నపూర్ణమ్మ’డొక్కా సీతమ్మ.. ఆమె 1909 ఏప్రియల్ 28న శివైక్యం చెందారు. 1903 జనవరి 1న అప్పటి మద్రాసు ప్రభుత్వం ఆమెకు ప్రశంసాపత్రాన్ని ఇచ్చింది, పి.గన్నవరం వద్ద వైనతేయ గోదావరిపై నిర్మించిన అక్విడక్ట్కు అప్పటి తెదేపా ప్రభుత్వం డొక్కా సీతమ్మ అక్విడక్ట్గా పేరుపెట్టింది. ఆమె చరిత్ర ప్రాథమిక పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లోనూ చేరింది. అంతటి ఆకలి తీర్చే అమ్మపేరును ఇప్పుడు మధ్యాహ్న భోజన పధకానికి పెట్టడం ఆమెని గౌరవించుకోవడంలో ఒక చిన్న కర్తవ్యంగా గా చేప్పవచ్చు ..