రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. .. ఎప్పటికప్పుడు
రాజకీయాలు సుడిగుండం లా మారుతున్నాయి .. దీనిలో భాగంగా
జగన్ కి ప్రధాన ప్రత్యర్థని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావించి ఉండొచ్చు. వాస్తవమే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు కూడా వైసిపి బలమైన పోటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీని కూటమి పార్టీలు ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లో బాగా కట్టడి చేశాయి. 11 స్థానాలకు పరిమితం చేసాయి. ఇంతవరకు బాగానే ఉంది. అసలు విషయానికొస్తే ..!
ఎందుకంటే వైసిపి ఎలానూ బలంగా లేదు. ఆ పార్టీలో నాయకులు కూడా ఉంటారా? ఉండరా? అనేది రాబోయే రెండు మూడు నెలల్లో తేలిపోతుంది. కాబట్టి వైసిపి తరఫున జగన్ మాత్రమే పోరాటానికి దిగాల్సి ఉంటుంది. కాబట్టి అది పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు.
కానీ షర్మిల రంగంలోకి దిగితే చంద్రబాబు కు చుక్కలే కనిపిస్తాయి అంటున్నారు .. ఎందుకంటే సొంత అన్నపై ఏ రేంజ్ లో వ్యాఖ్యలు చేసిందో అందరికితెలిసిందే .. కాంగ్రెస్ లో చేరి జగన్ ను ముప్పతిప్పలు పెట్టి .. ప్రస్తుతం జగన్ ఓటమికి ఒక కారణం షర్మిల అనొచ్చు… ఇదే రాజకీయాల్లో చర్చ కూడా సాగింది .. ప్రస్తుతం షర్మిల చంద్రబాబే టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు మొదలెట్టింది …
రాష్ట్రంలో హత్యలు, మహిళల మీద దాడులు జరుగుతున్నాయని, లైంగిక దాడులు జరుగుతున్నాయని, అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. గతంలో జరిగినట్టుగానే ఇప్పుడు కూడా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు షర్మిల. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన కీలక హామీలను కూడా ఆమె కార్నర్ చేశారు. మహిళలకు ఇస్తామన్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఏమైంది? అని ప్రశ్నించారు.
తెలంగాణ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండో రోజు నుంచి ఆర్టిసి బస్సులను ఉచితంగా మహిళలకు తీసుకొచ్చిందని చెప్పారు. కర్ణాటకలో అధికారం చేపట్టిన రోజు నుంచే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సిద్ధరామయ్య ఆర్టిసి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశారని చెప్పుకొచ్చారు. మరి ఏపీలో ఏ కారణాలతో నెల రోజులు పాటు ఆపారని ప్రశ్నించారు. అదే సమయంలో 18 ఏళ్లు నిండిన మహిళలకు ఇస్తానన్న 1500 రూపాయల పథకం ఏమైంది? అని ప్రశ్నించారు. అంటే ప్రస్తుతానికి ఈ రెండు పథకాలు ప్రశ్నించడం ద్వారా ఇప్పటికి తను పరిమితం అవుతున్నానని చెప్పినా.. మున్ముందు మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేయటం గమనార్హం.
అయితే ఇవన్నీ చూస్తుంటే షర్మిల ఈసారి గట్టిగానే చంద్రబాబు తో కొట్లాటకు దిగుతుంది అని క్లియర్ గా అర్ధం అవుతుంది ..
అదే తరుణంలో మళ్ళీ అన్నపై కూడా ధ్వజమెత్తి .. గతప్రభుత్వం అంటూ కామెంట్స్ చేసింది … చూడాలి అటు అన్నకు ఇటు బాబు కు షర్మిల గండం ఉన్నట్లే..