బెంగళూరులోని కోరమంగళలో ఒక లేడీస్ పీజీ హాస్టల్లో ఉంటున్న 22 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది .ప్రస్తుతం ఇదే వైరల్ గా మారింది .. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న కృతి కుమారి అనే యువతిని బీహార్ కు చెందిన 22 ఏళ్ల యువకుడు అతి కిరాతకంగా హత్య చేశాడు. మంగళవారం రాత్రి పొద్దుపోయాక 11.30 సమయానికి హంతకుడు హాస్టల్లోకి జొరబడ్డాడు. ఎవరి కంటా పడకుండా కృతి కుమారి థర్డ్ ఫ్లోర్లో ఉన్న రూంలో ఉంటుందని తెలుసుకున్నాడు. ఆమె ఉంటున్న రూంలోకి ప్రవేశించాడు. ప్లాన్ ప్రకారం ఆమెను హత్య చేయాలని డిసైడ్ అయి వెళ్లి తన వెంట తీసుకెళ్లిన కత్తితో ఆ యువకుడు కృతి కుమారి గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది.
ప్రాథమికంగా తెలిసిన వివరాల ప్రకారం కృతి కుమారితో పాటు మరో యువతి పీజీలో ఉంటోంది. ఈ యువతికి ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతనికి ఉద్యోగం లేకపోవడం వల్ల ఇద్దరి మధ్యా గొడవలు జరిగేవి. ఇలా గొడవలు పడడం కన్నా విడిపోవడం మంచిదని ఫ్రెండ్‌కి సలహా ఇచ్చింది కృతి కుమారి. ఈ కారణంగానే కృతిపై యువకుడు కక్ష పెంచుకున్నాడు. తరవాత దారుణంగా హత్య చేశాడు. దాడి చేయబోతుండగా ఆ యువతి తనను తాను విడిపించుకునేందుకు చాలా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది .. తాజాగా హంతకుడిని అరెస్ట్ చేశారు .. మధ్యప్రదేశ్‌లో అతని మొబైల్ సిగ్నల్ కనిపించింది. ఆ తరవాత స్విచాఫ్ అయింది. ఈ సిగ్నల్‌ని ట్రాక్ చేసిన పోలీసులు మధ్యప్రదేశ్‌లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. గొడవలు పడటం కన్నా విడిపోయే ఎవరి బతుకు వారు హాయిగా బతకండి అని చెప్పిన పాపానికి ఆమె ఘోరంగా హత్యకు గురి అయింది ..
సో ఇన్ని హత్యలు జరుగుతున్నా వీటిని అరికట్టడానికి ఒక చట్టం ఇంకా లేదు అనే చెప్ప్పాలి .. ఉన్న కొన్ని సరైన శిక్ష పడేలా లేవు … ఇలాంటి హత్యలు ఆగేదెప్పుడు ?