తమిళ స్టార్ హీరో సూర్య ఆయనకు తెలుగు లో మంచి పేరుంది … అలాగే తెలుగు హీరోకున్న క్రేజ్ ఉంది … సూర్య అంటే అమ్మాయిలకి పిచ్చి ..అయన తన నటనతో తెలుగు లో కూడా గుర్తింపు తెచ్చుకొని తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు .. తెలుగు లో తీసింది కొన్ని సినిమాలే అయినా స్టార్ డమ్ సంపాదించాడు … అయితే ఈ మధ్య సూర్య
కంగువా సినిమా షూటింగ్‌ను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు… దీంతో పాటు మరిన్ని ప్రాజెక్టుల్లో ఆయన బిజీగా ఉన్నారు. అందులో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుది ఒకటి. Suriya 44 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు… సూర్య పుట్టినరోజు సందర్భంగా Suriya 44 గ్లింప్స్‌ను రిలీజ్ చేసి సూర్యకు మూవీ టీమ్ బర్త్‌డే విషెస్ చెప్పింది. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది… యూట్యూబ్ లో ఈ గ్లింప్స్
తెగ వైరల్ అవుతుంది … ఈ సినిమా సూర్య కి పెద్ద హిట్ అవుతుందని టాక్ కూడా వినిపిస్తుంది .. ఒక్క డైలాగ్ కూడా లేకుండా సైలెంట్ గా చంపేశారు సూర్య. విక్రమ్ సినిమాలో రోలెక్స్ రేంజ్లో సూర్య కనిపించారు. ఈ చిత్రంలో ఆయన గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గ్లింప్స్‌లో మరో హైలెట్ ఏంటంటే సంతోష్ నారాయణన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఇటీవల కల్కి 2898 ఏడీతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంతోష్ నారాయణన్.. ఈ గ్లింప్స్‌కి ఇచ్చిన బీజీ వేరే లెవల్లో ఉంది.ఈ సినిమాను 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డేతో పాటు మలయాళ స్టార్ హీరో జోజు జార్జ్, జయరామ్ లాంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతి కల్లా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.అందుకే షూటింగ్ త్వరగా పూర్తి చేసారు ..
ఇదిలా ఉండగా, సూర్య డిఫరెంట్ పాత్రలో నటించిన కంగువ మూవీ దసరా కానుకగా అక్టోబరు 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో యంగ్ హీరోయిన్ దిశా పటానీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, ట్రైలర్ ఈ మూవీపై అభిమానుల్లో మరింత అంచలాను పెంచేసింది.కంగ అనే ఓ పరాక్రముడి కథ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీలో సూర్య ఆరు విభిన్న లుక్స్‌లో కనిపిస్తారని సినీ వర్గాల టాక్ . ఇప్పటికే మేకర్స్ కూడా రెండు ఇంట్రెస్టింగ్ లుక్స్‌ను అభిమానుల కోసం రివీల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సూర్య తన అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పుట్టిన రోజు కోసం ఇటీవలే ఏర్పాటు చేసిన ఓ రక్తదాన శిబిరానికి హాజరయ్యారు. అంతేకాకుండా రక్తం కూడా దానం చేశారు. ఇదే క్యాంపులో 400 మంది సూర్య ఫ్యాన్స్ కూడా బ్లడ్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.