Home » రామోజీరావు గారు చేసిన మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా?

రామోజీరావు గారు చేసిన మొదటి ఉద్యోగం ఏంటో తెలుసా?

by Goldandhraadmin
0 comment

ఆయన పేరు చెప్తే చాలు పరిచయం అక్కర్లేదు..
ఆయన ప్రయాణం అద్భుతం..
ఆయన చేరుకున్న గమ్యాలు అజరామరం…
ఆయన ప్రస్థానం ఎంతోమందికి మందికి స్ఫూర్తిదాయకం….

రామోజీరావు గారి తల్లి చాలా భక్తిపరురాల కావడంతో చిన్నతనంలో రామోజీకి భక్తి, శుచి,శుభ్రత అలవడింది.
రామోజీరావు పేరు జనాల్లోకి ఎంతలా వెళ్లిపోయిందంటే ఆయన గురించి తెలియని తెలుగు వారు ఉండరు. ప్రింట్ మీడియాలో నూతన ఒరవడి సృష్టించిన ఆయన సినిమా రంగంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా దేశంలో అత్యద్భుతంగా రామోజీ ఫిలిమ్ సిటినీ నిర్మించారు. ఇవన్ని అందరికి తెలిసిన విషయాలే. అయితే ఆయన గురించిన అరుదైన విషయాలు చూద్దాం.

రామోజీరావు అనేది తల్లి,తండ్రులు పెట్టిన పేరు కాదు. ఆయన అసలు పేరు రామయ్య. అయితే ఆ పేరు నచ్చని ఆయన తన పేరుని రామోజీగా మార్చేసుకున్నారు. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 18న ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో రామోజీరావు జన్మించారు. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామర్రు మండలంలోని పెరిశేపల్లి గ్రామానికి చెందినవారు. ఆయన తాత రామయ్య కుటుంబంతో కలిసి పెరిశేపల్లి నుంచి పెదపారుపూడికి వలస వచ్చాడు. తాత మరణించిన 13 రోజులకు రామోజీరావు జన్మించారు. దానితో తాతగారి జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అన్న పేరు పెట్టారు.

ఇక శ్రీ వైష్ణవ కుటుంబనేపథ్యం కావడం, తల్లి చాలా భక్తిపరురాల కావడంతో చిన్నతనంలో రామోజీకి భక్తి, శుచి,శుభ్రత అలవడింది. భక్తి అనేది ప్రక్కన పెడితే ఆయన జీవితాతం శుచి,శుబ్రతలకు బాగా ప్రయారిటీ ఇచ్చేవారు. ఏ మాత్రం అశుభ్రత ఉన్నా ఒప్పుకునేవారు కాదు. ఇక లేకలేక పుట్టిన మగసంతానం కావడంతో రామోజీని అల్లారుముద్దుగా పెంచారు.
పెద్దక్కకు వివాహం కావడంతో చిన్నక్క రంగనాయకమ్మతో ఆయనకు సాన్నిహిత్యం ఉండేది. ఇంట్లో తల్లికి ఇంటిపనుల్లో, వంటలో సహాయం చేసే అలవాటూ ఉండేవి. రామయ్య అన్న తన పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేప్పుడే స్వంతంగా “రామోజీ రావు” అన్న పేరును తనంతట, తానే పెట్టుకున్నారు.
చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా మొదట ఉద్యోగంలో చేసారు. అయితే 1962 లో హైదరాబాద్ కి తిరిగి వచ్చి పత్రికా రంగం వైపు దృష్టి సారించారు.ఈనాడు పత్రిక స్థాపించడానికి ముందు ఆయన ఎన్నో వ్యాపారాలు చేశారు. వ్యాపార రగంలో సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించారు.

రామోజీ రావు పత్రికా, డిజిటల్ రంగంలో ఎన్నో వినూత్న ప్రయోగాలు చేసి నూతన ఒరవడి సృష్టించారు. ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు.. ఎంతో మంది నూతన నటీనటులను వెండితెరకు పరిచయం చేశారు. హైదరాబాద్ లో హాలీవుడ్ తరహాలో ఒక ఫిలిమ్ సిటీ నిర్మించాలని ఆయన చిరకాల కోరిక. ఆ కల నెరవేర్చుకోవడానికి ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మించారు. ఇక్కడికి టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు షూటింగ్స్ జరుగుతున్నాయి. ఆయన మరణ వార్త విన్న సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన వారు దిగ్బ్రాంతికి గురయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్తీక దేహాన్ని తరలించనున్నారు

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved