Home » ఈనాడు ఉదయించిన సూర్యుడు అస్తమించాడు

ఈనాడు ఉదయించిన సూర్యుడు అస్తమించాడు

by Goldandhraadmin
0 comment

రామోజీరావు ఎన్నో వేల కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపారు. అచ్చమైన తెలుగుని, ఆదర్శనీయమైన కథనాలను ప్రజలకు చేరువ చేసే క్రమంలో ఎన్నో అద్భుతమైన కథనాలను ప్రజలకు చేర్చారు.
ఈటీవీ, ఈనాడు ద్వారా ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారం అయ్యారు
రామోజీరావు కృష్ణాజిల్లా పెదపారుపూడి 1936 నవంబర్ 18న జన్మించారు. ఈయన నాన్నగారు రైతు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి కెంటక సుబ్బారావు. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుకు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది

ప్రస్తుతం 87 ఏళ్ల వయసున్న ఆయన గతంలోనూ అనారోగ్యంతో బాధపడ్డారు. వైరల్ ఫీవర్, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలతో సతమతమవగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇక ఈనాడు గ్రూప్కు చైర్మన్, రామోజీ ఫిల్మ్ సిటీకి యజమాని అయిన రామోజీరావు.. 60కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. దశాబ్దాల తరబడి తెలుగు రాజకీయాలపై తనదైన శైలిలో ప్రభావం చూపారు.

రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం మృతి చెందారు.శనివారం ఉదయం 4. 50 గంటలకు కన్నుమూశారు.
ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved