Home » రామోజీరావు కి చంద్రబాబు నాయుడుకి మధ్య ఉన్న స్నేహబంధం ఈనాటిది కాదు

రామోజీరావు కి చంద్రబాబు నాయుడుకి మధ్య ఉన్న స్నేహబంధం ఈనాటిది కాదు

by Goldandhraadmin
0 comment

రామోజీరావు గారు టిడిపి స్థాపించినప్పటి నుంచి సీనియర్ ఎన్టీఆర్ కి ఎంత సహకరించారో అంతకంటే ఎక్కువే చంద్రబాబుతో సాన్నిత్యం ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా టిడిపి పదవిలో ఉన్నప్పుడు రామోజీరావు గారు చంద్రబాబు గురించి ఎవరు మాట్లాడుకోకపోయినా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడుకి తగ్గట్టే ఆర్టికల్స్..చంద్రబాబుకి తగ్గట్టే ఈటీవీలో వార్తలు ఇలా ప్రతిదీ చంద్రబాబుకి రామోజీరావు చాలా సహకరిస్తారు అని ఎప్పుడూ ప్రతిపక్షం వాళ్ళు చెప్తుండేవాళ్ళు…కానీ ఇద్దరి మధ్య స్నేహబంధం గత మూడు దశాబ్దాలకు పైగా అటు రాజకీయాలకి చంద్రబాబుకి చేదోడువాదోడుగా అలాగే రామోజీరావు గారికి వ్యాపారాల్లో చంద్రబాబు నాయుడు చేదోడు వాదోడుగా ఉండేవారు అని చెబుతుండేవారు.
రామోజీరావు గారు..కృష్ణా జిల్లా పెదపారపూడి గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో 1936 నవంబర్16 న చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు.
ఆయనకు రాజ్యలక్ష్మీ, రంగనాయకమ్మ అనే ఇద్దరు అక్కయ్యలు ఉన్నారు.

1947లో గుడివాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతిలో చేరి 1951 వరకు సిక్త్స్ ఫాం వరకు చదివారు. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్, బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం దిల్లీలోని ఓ యాడ్ ఏజన్సీలో ఆర్టిస్ట్గా చేరారు.
1961లో తాతినేని రమాదేవితో వివాహం జరిగాక
1962లో హైదరాబాద్లో స్థిరపడ్డారు.1962 అక్టోబరులో మార్గదర్శి చిట్ఫండ్ స్థాపన.
1965లో కిరణ్ యాడ్స్ ప్రారంభం.
1967-1969 వరకు ఖమ్మంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం.
1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు.
1970లో ఇమేజస్ అవుట్డోర్ అడ్వర్టయిజింగ్ ఏజన్సీ ప్రారంభం.
1972-1973 విశాఖలో డాల్ఫిన్ హౌటల్ నిర్మాణానికి శ్రీకారం.
1980లో త్రీస్టార్ హౌటల్గా డాల్ఫిన్ ప్రారంభం.1974లో విశాఖ ‘ఈనాడు’ దిన పత్రిక ప్రారంభం.
1974లో మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభం.
1975 డిసెంబరు 17న ‘ఈనాడు’ హైదరాబాదు ఎడిషన్ ప్రారంభమైంది.
1976లో సినీ ప్రేమికుల కోసం ‘సితార’ పత్రికను ప్రారంభించారు.
ఫిబ్రవరి 1978లో ‘చతుర’, ‘విపుల’ మాస పత్రికల ప్రారంభం.
1980లో ‘ప్రియా ఫుడ్స్’ ప్రారంభం.
1983లో ‘ఉషాకిరణ్ మూవీస్’ సంస్థ ఏర్పాటు.
1990లో ‘ఈనాడు జర్నలిజం స్కూలు’ ప్రారంభం.
1992-1993లో సారాపై సమరం. మధ్యంపై నిషేద ఉత్తర్వులు వచ్చేదాకా పోరు.
1996లో ప్రపంచలోనే అతి పెద్ద చిత్రనగరి ‘రామోజీ ఫిల్మ్ సిటీ’ స్థాపన
2002లో ‘ఈటీవీ’ ఆధ్వర్యంలో ఆరు ప్రాంతీయ ఛానళ్ల ప్రారంభం.
2002లో ‘రమాదేవి పబ్లిక్ స్కూల్’ ప్రారంభం.
2008లో సమాచార చట్టం కోసం ‘ముందడుగు’
2014లో ప్రధాని ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమ ప్రచార భాగస్వామిగా రామోజీరావును నామినేట్ చేశారు.
2015లో మరో నాలుగు ఈటీవీ ఛానళ్ల ఆరంభం.

రామోజీరావు మృతిపై చంద్ర‌బాబు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారని ఆయ‌న అన్నారు. అక్షర యోధుడుగా, తెలుగు వెలుగుగా పేరున్న రామోజీరావు సేవలు ఎనలేనివని ఆయ‌న చెప్పారు. తెలిపారు. తెలుగువారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేశారని కొనియాడారు. సమస్యలపై పోరాటంలో రామోజీరావు అందరికీ స్ఫూర్తి అని చంద్ర‌బాబు తెలియ‌జేశారు.. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు

You may also like

Leave a Comment

Follow us for More Updates

Stay updated about the latest news, views, analysis, and reviews about the new trailers, latest movies, web series, songs, celebrity life, and sports news.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

© 2024 GoldAndhra | All Rights Reserved